Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోకేశ్ కనగరాజ్ మేజిక్ .. రజనీతో తలపడే విలన్ గా లారెన్స్?

Lawrence in Rajani movie
Advertisement
  • లోకేశ్ కనగరాజ్ కి రజనీ గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు
  • రజనీ సినిమాలో లారెన్స్ కి దక్కిన ఛాన్స్ 
  • ఖుషీ అవుతున్న లారెన్స్

Advertisement
'జైలర్' సినిమా రజనీకాంత్ విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించింది. వసూళ్ల పరంగా ఆ సినిమా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఓటీటీలోను ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతుండటం విశేషం. ఈ సినిమా తరువాత ప్రాజెక్టులను రజనీ చాలా ఫాస్టుగా లైన్లో పెట్టేశారు. ప్రస్తుతం ఆయన జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. 

ఆ తరువాత సినిమాను లోకేశ్ కనగరాజ్ తో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో విలన్ గా లారెన్స్ పేరు వినిపిస్తోంది. లోకేశ్ ఇంతవరకూ చేస్తూ వచ్చిన సినిమాలు చూస్తే, హీరో - విలన్ రోల్స్ ను ఆయన ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేస్తాడనేది అర్థమవుతుంది. అదే పద్ధతిని ఆయన ఈ సినిమా విషయంలోనూ ఫాలో అవుతున్నాడని అంటున్నారు. తాను రజనీకి వీరాభిమానినంటూ లారెన్స్ చెబుతుంటాడు .. ఆయన స్టైల్ ను అనుకరిస్తూ ఉంటాడు కూడా. రజనీతో ఆయనకి మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఇప్పుడు తెరపై రజనీతోనే తలపడే అవకాశం ఆయనకి దక్కింది. తన ఫేవరేట్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదంటూ లారెన్స్ ఖుషీ అవుతున్నాడని చెబుతున్నారు.
Advertisement
Advertisement
Lawrence
Rajanikanth
Lokesh Kanagaraj
Kollywood

More Telugu News